ప్లాస్టిక్ కు గుడ్‌బై.. ఇది ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా ప్లాస్టిక్ వాడని విమానాన్ని నడిపి.. ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఎర్త్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆ సంస్థ ఈ విశిష్టమైన నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా అబుదాబీ నుంచి ప్రయాణమైన ఈ విమానం ఏప్రిల్ 22 న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ల్యాండ్ అయింది.  2022 నాటికి ఎతిహాద్ విమానాలతో పాటు… ఎతిహాద్ విమాన సంస్థల్లో కూడా […]

ప్లాస్టిక్ కు గుడ్‌బై.. ఇది ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
Ravi Kiran

|

Apr 25, 2019 | 4:39 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా ప్లాస్టిక్ వాడని విమానాన్ని నడిపి.. ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఎర్త్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆ సంస్థ ఈ విశిష్టమైన నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా అబుదాబీ నుంచి ప్రయాణమైన ఈ విమానం ఏప్రిల్ 22 న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ల్యాండ్ అయింది.  2022 నాటికి ఎతిహాద్ విమానాలతో పాటు… ఎతిహాద్ విమాన సంస్థల్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని 80 శాతం తగ్గిస్తామని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. 2019 చివరకు ఎతిహాద్ విమానాల్లో 100 టన్నుల సింగిల్-యూజ్ ప్లాస్టిక్ పదార్థాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వారు తెలియజేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu