ఇకచాలు.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: గంభీర్

| Edited By: Srinu

Mar 07, 2019 | 8:28 PM

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30కి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కినిపిస్తోంది. 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. రెండు వాహనాలను ఉగ్రమూకలు టార్గెట్ చేశాయి. దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. అయితే ఈ దాడి పట్లు టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవును ఏర్పాటువాదులతో […]

ఇకచాలు.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: గంభీర్
Follow us on

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30కి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కినిపిస్తోంది. 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. రెండు వాహనాలను ఉగ్రమూకలు టార్గెట్ చేశాయి. దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.

అయితే ఈ దాడి పట్లు టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవును ఏర్పాటువాదులతో చర్చలు జరుపుదాం. పాకిస్థాన్‌తో చర్చలు జరుపుదాం. అయితే ఈసారి చర్చలు టేబుల్ మీద ఉండకూడదు, యుద్ధభూమిలోనే తేల్చుకోవాలని గంభీర్ అన్నాడు. ఇప్పటి వరకూ జరిగింది ఇక చాలు అంటూ గంభీర్ తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని మోడీ స్పందిస్తూ జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృధా కానివ్వబోమని అన్నారు.