వామో…! కరోనా ఖత్తర్‌నాక్‌ వైరసట!

| Edited By: Srinu

Feb 08, 2020 | 7:18 PM

ఇప్పటికే ప్రపంచ దేశాలకు నిద్రపట్టనివ్వకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ అనుకున్నదానికంటే ప్రమాదకారట! ఆ పిశాచాన్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదట! బ్రిటిష్‌ సైంటిస్ట్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ జాన్‌ ఎడ్ముండ్స్‌ చెబుతున్నది వింటే మరింత భయమేస్తోంది… ఇప్పటికే ఏడు వందలకు పైగా ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ మరో 32 వేల మంది ప్రాణాలతో ఆటలాడుకుంటోంది… ఈపాటికే 27 దేశాల్లో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోంది… […]

వామో...! కరోనా ఖత్తర్‌నాక్‌ వైరసట!
Follow us on

ఇప్పటికే ప్రపంచ దేశాలకు నిద్రపట్టనివ్వకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ అనుకున్నదానికంటే ప్రమాదకారట! ఆ పిశాచాన్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదట! బ్రిటిష్‌ సైంటిస్ట్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ జాన్‌ ఎడ్ముండ్స్‌ చెబుతున్నది వింటే మరింత భయమేస్తోంది… ఇప్పటికే ఏడు వందలకు పైగా ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ మరో 32 వేల మంది ప్రాణాలతో ఆటలాడుకుంటోంది… ఈపాటికే 27 దేశాల్లో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోంది…

బ్రిటన్‌లోనూ ఇప్పటికే మూడు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి.. వచ్చే వారం నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అక్కడి వైద్యశాఖ అంటోంది… ప్రస్తుతం లండన్‌లోని ల్యాబ్‌లో రోజుకు వంద మందికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ ఎంత డేంజరంటే.. ఈ వైరస్‌ సోకినప్పుడు ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటపడవట! ఈ కారణంగానే చాలా మంది లైట్‌ తీసుకుంటారు.. చివరి నిమిషాల్లో పరీక్షలు జరిపించుకున్నా పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు జాన్‌ ఎడ్ముండ్స్‌… కాకపోతే మొదట్లోలా ఇప్పుడు కరోనా వైరస్‌ అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదట! ఇదొక్కటే కాసింత గుడ్‌న్యూస్‌…