కరోనా ఎఫెక్ట్.. ఖాళీగా దర్శనమిస్తున్న హైదరాబాద్ రోడ్లు..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ధి రోజుల్లో కేసులు పెరుగుతాయనే

కరోనా ఎఫెక్ట్.. ఖాళీగా దర్శనమిస్తున్న హైదరాబాద్ రోడ్లు..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 6:42 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది జుల్లో కేసులు పెరుగుతాయనే అంచనాల మధ్య చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఇంటిపట్టునే ఉంటున్నారు. భాగ్యనగరంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.

ఈ మహమ్మారి దెబ్బకు చిన్నా చితకా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినప్పటికీ ఆ తర్వాత సాధారణ పరిస్థితులు ఉంటాయని అంతా భావించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు టూ లెట్ బోర్డు కనిపిస్తే చాలు వెంటనే అడ్వాన్స్ ఇచ్చి దిగిపోయేవారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.