ఒకేసారి బీహార్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణ.!
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. వివిధ రాష్ట్రాల శాసనసభలో 64 సీట్లు, 1 ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నట్లు గుర్తించింది.

Election Commission Of India: దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. వివిధ రాష్ట్రాల శాసనసభలో 64 సీట్లు, 1 ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నట్లు గుర్తించింది. ఇక బీహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 26వ తేదీతో ముగుస్తుండటంతో.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 65 సీట్లకు ఉప ఎన్నికలను కూడా అదే సమయంలో నిర్వహించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
అటు తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఆ సీటుకు కూడా అదే సమయంలో ఉప ఎన్నిక జరగనుంది. కాగా, అధిక వర్షాలు, కోవిడ్ మహమ్మారి సహా పలు కారణాలతో ఉప-ఎన్నికలు వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా.. నవంబర్ నెలాఖరులోగా బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. ఉప ఎన్నికలను కూడా అదే సమయంలో నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధం అవుతోంది.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..




