పురుషుల్లో సంతానోత్పత్తికి శక్తిని పెంచుతోన్న ‘టమాట’!

|

Oct 10, 2019 | 9:57 PM

టమాటలో వీర్య కణాల నాణ్యత పెంచే మిశ్రమ పదార్థం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వండిన టమాటాలను తినడం వల్ల వీర్య కణాల పరిమాణం, ఆకారంలో వృద్ధి ఉంటుందని తేలింది. ఇందులో ఉండే లాక్టోలైకోపీన్​ అనే మిశ్రమ పదార్థం వీర్య కణాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. వివిధ రకాల ఔషధాలపై ప్రయోగాలు చేశారు బ్రిటన్​లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. 19 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన 60 మందిపై 12 వారాల పాటు […]

పురుషుల్లో సంతానోత్పత్తికి శక్తిని పెంచుతోన్న టమాట!
Follow us on

టమాటలో వీర్య కణాల నాణ్యత పెంచే మిశ్రమ పదార్థం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వండిన టమాటాలను తినడం వల్ల వీర్య కణాల పరిమాణం, ఆకారంలో వృద్ధి ఉంటుందని తేలింది. ఇందులో ఉండే లాక్టోలైకోపీన్​ అనే మిశ్రమ పదార్థం వీర్య కణాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. వివిధ రకాల ఔషధాలపై ప్రయోగాలు చేశారు బ్రిటన్​లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. 19 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన 60 మందిపై 12 వారాల పాటు పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనకు ముందు, తర్వాత వారి రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి పలు విషయాలపై నిర్ధరణకు వచ్చారు.

కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో  సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్సల అవసరాన్ని తగ్గించడానికి తాజా శోధనలు సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు, ఎందుకంటే పిల్లులు పుట్టని చాలా కేసులలో 40 శాతానికి పైగా  స్పెర్మ్ కౌంట్ లేదా వాటి పనితీరు కారణంగా ఉన్నాయి. అటువంటివారికి టమాట చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది వారి భావన.