గుజరాత్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదు

|

Sep 29, 2020 | 8:53 PM

సౌరాష్ట్రలో మరోసారి భూమి కంపించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

గుజరాత్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదు
Follow us on

సౌరాష్ట్రలో మరోసారి భూమి కంపించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్మోలాజికల్‌ రీసెర్చ్‌ (ఐఎస్‌ఆర్‌) తెలిపింది. గాంధీనగర్‌లోని ఐఎస్‌ఆర్‌ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3.39 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం జిల్లాలోని ఉప్లెటా పట్టణం నుంచి తూర్పు ఈశాన్య దిశలో, భూమి లోపల 14.5 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకంపనలతో ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదికలు, ఫిర్యాదులు అందలేదని రాజ్‌కోట్‌ గ్రామీణ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు.