
మరోసారి భూప్రకంపనలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోయింది. వరుస భూ కంపాలతో ముంబై వాసులు హడలిపోతున్నారు. గత శుక్ర, శనివారాల్లో ఉత్తర ముంబైలో భూమి కంపించింది. అటు నాసిక్ సమీపంలోనూ భూమి కంపించింది. తాజాగా సోమవారం ఉదయం 8 గంటలకు మరోసారి స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదయ్యింది. ముంబైకి ఉత్తరాన 102 కి.మీ. దూరంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. శనివారం ఉదయం 6.36 గంటలకు 2.7 తీవ్రతతో ముంబైకి ఉత్తరంగా భూమి కంపించింది. అందకు ముందురోజు శుక్రవారం ఉదయం 10.33 గంటలకు 2.8 తీవ్రతతో భూమి కంపించగా, అదేరోజు 11.41 గంటలకు నాసిక్‌లో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.
देश में चार दिनों से लगातार भूकंप का सिलसिला, आज सुबह फिर मुंबई में कांपी धरती#Earthquake | #Mumbaihttps://t.co/b2IABHv1xp
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) September 7, 2020