దుబ్బాక ఫలితం: టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఆపార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఈ ఘటన నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో ఓటమికి గురైందన్న మనస్థాపంతో కొత్తింటి స్వామి(34) రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలవేసి అంజలి ఘటించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వామి మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం హరీశ్ రావు.. […]

దుబ్బాక ఫలితం: టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య.. పాడె మోసిన హరీశ్
Follow us

|

Updated on: Nov 11, 2020 | 2:36 PM

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఆపార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఈ ఘటన నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో ఓటమికి గురైందన్న మనస్థాపంతో కొత్తింటి స్వామి(34) రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలవేసి అంజలి ఘటించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వామి మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం హరీశ్ రావు.. అంత్యక్రియల్లో పాల్గొని స్వామి పాడే మోశారు.