2021లో ప్రభుత్వ సెలవులు ఎన్నో తెలుసా…

2021లో ప్రభుత్వ సెలవులు ఎన్నో తెలుసా...

తెలంగాణ కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెలవుల క్యాలెండర్‌ను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 2:55 PM

Telangana Government Holidays Calendar : తెలంగాణ కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెలవుల క్యాలెండర్‌ను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఇందులో 28 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని  పేర్కొన్నారు. 2021 కొత్త సంవత్సరం ప్రారంభ దినమైన జనవరి ఒకటో తేదీని సాధారణ సెలవుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 2021 ఫిబ్రవరి13న వచ్చే రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు 2021లో ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవులు వినియోగించుకోవచ్చని సీఎస్‌ ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.

ఈ సాధారణ సెలవులు పరిశ్రమలకు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. పబ్లిక్‌ వర్క్స్‌ విభాగాలు, విద్యాసంస్థలు.. సెలవులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ.. జీవోను జారీ చేసింది. ఈదుల్‌ ఫితర్‌ , ఈదుల్‌ అఝా, మొహర్రం, మిలాద్‌ ఉన్‌ నబి పండుగలకు సంబంధించి ఏదైనా మార్పులుంటే తెలియజేస్తామని వెల్లడించింది.

సాధారణ సెలవులు

ఐచ్ఛిక సెలవులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu