కేసీఆర్‌కు డిఎస్ ఓపెన్ ఛాలెంజ్

|

Jan 20, 2020 | 6:16 PM

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చాలా రోజుల తర్వాత నోరు మెదిపిన డిఎస్.. కేసీఆర్‌తో అమీతుమీకి రెడీ అన్నట్లుగా మాట్లాడారు. తన రాజకీయ ప్రస్తానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అధినేత ఫ్యామిలీపైనా, అదే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రిపైనా విరుచుకుపడ్డారాయన. డిఎస్‌గా పిలవబడే ధర్మపురి శ్రీనివాస్.. తెలంగాణ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథిగా రెండు […]

కేసీఆర్‌కు డిఎస్ ఓపెన్ ఛాలెంజ్
Follow us on

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చాలా రోజుల తర్వాత నోరు మెదిపిన డిఎస్.. కేసీఆర్‌తో అమీతుమీకి రెడీ అన్నట్లుగా మాట్లాడారు. తన రాజకీయ ప్రస్తానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అధినేత ఫ్యామిలీపైనా, అదే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రిపైనా విరుచుకుపడ్డారాయన.

డిఎస్‌గా పిలవబడే ధర్మపురి శ్రీనివాస్.. తెలంగాణ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథిగా రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత డీఎస్ సొంతం. ఒక దశలో ఉమ్మడి రాష్ట్రంలో రెండో పవర్ సెంటర్‌గా రాజకీయం చేసిన వ్యక్తి. అయితే.. కాంగ్రెస్ పార్టీలో అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జితో సరిపడక.. పార్టీని వీడి గులాబీ గూటికి చేరారాయన. ఇక్కడి దాకా అంతా బాగానే నడిచినా.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఇమడడం ఆయన వల్ల కాలేదు.

ఒక దశలో కేసీఆర్‌కు సన్నిహితుడై.. ఏకంగా రాజ్యసభ సీటును కొట్టేశారు. కానీ అంతలోనే కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయి నిరాదరణకు గురవుతున్నారు. కేసీఆర్ కూతురు కవిత స్వయంగా ఎమ్మెల్యేల సంతకాలతో డిఎస్‌పై చర్యతీసుకోవాలని గులాబీ బాస్‌ను కోరారు.

చాలా కాలంగా సైలెంట్‌గా వుంటున్న డిఎస్.. సోమవారం మనసు విప్పారు. మాట పంచుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని మధనపడ్డారు. అప్పట్లో దిగ్విజయ్ సింగ్ తనకు వ్యతిరేకంగా సోనియాకు నివేదిక ఇచ్చారన్న అలకతో కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ఒక్క కుటుంబం బాగుపడినంత మాత్రాన బంగారు తెలంగాణ వచ్చినట్లా అని కేసీఆర్‌ను సవాల్ చేశారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు డిఎస్. కొంత మంది ఎమ్మెల్యేలు తమకు ఇష్టం లేకున్నా తన సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే దనపై చర్యలు తీసుకోవాలన్నారు.