తవ్వకాల్లో వెలుగుచూస్తున్న డ్రగ్స్‌

|

Aug 19, 2020 | 9:40 PM

హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ముఠాలు పడుతున్నాయి..శివారులను డ్రగ్స్‌ డెన్‌గా మార్చుకుని సీక్రెట్‌గా బోర్డర్‌ దాటించేస్తున్నారు. గత ఐదు రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు సదరు కంపెనీతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.

తవ్వకాల్లో వెలుగుచూస్తున్న డ్రగ్స్‌
Follow us on

Drugs Seized at Hyderabad : హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ముఠాలు పడుతున్నాయి..శివారులను డ్రగ్స్‌ డెన్‌గా మార్చుకుని సీక్రెట్‌గా బోర్డర్‌ దాటించేస్తున్నారు. గత ఐదు రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు సదరు కంపెనీతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. సోదాలు చేసినా కనిపించకుండా ఉండేందుకు వీలుగా మత్తు మందులను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి.  జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీలో Drugs బయటపడ్డాయి.

45 కిలోల ఎఫిడ్రిన్‌, 7.5 కిలోల మెఫిడ్రోన్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా దందా చేస్తున్న ముఠా.. ఒకవేళ పోలీసులు వచ్చినా దొరకకుండా భూమిలో పాతిపెట్టారు. పక్కా సమాచారంతో రెయిడ్‌ చేసిన పోలీసులు…భూమిలో పాతిపెట్టిన మత్తు పదార్ధాలను బయటకు తీశారు. మాదక ద్రవ్యాల ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.