హైదరాబాద్ భారీ స్థాయిలో పట్టుబడిన డ్రగ్స్..విలువ కోట్లల్లో ఉంటుందంటున్న డీఆర్ఐ అధికారులు

భాగ్యనగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్‌ను ఎయిర్‌పోర్టులో  డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు..

హైదరాబాద్ భారీ స్థాయిలో పట్టుబడిన డ్రగ్స్..విలువ కోట్లల్లో ఉంటుందంటున్న డీఆర్ఐ అధికారులు

Edited By:

Updated on: Dec 20, 2020 | 12:43 AM

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్‌ను ఎయిర్‌పోర్టులో  డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అందుకున్న అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఫుడ్ మెటీరియల్స్ చాటున డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో కిలోకి పైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరాపై డీఆర్‌ఐ ఆందోళన ‍ వ్యక్తం చేసింది. ఫుడ్ ఐటమ్స్‌లో కలిపి తీసుకునే డ్రగ్‌గా దీన్ని  గుర్తించారు.