సెప్టెంబర్ 1 నుంచి ఇంటివద్దకే రేషన్

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రజల ఇంటి వద్దకే రేషన్‌ సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:50 am, Tue, 21 July 20
సెప్టెంబర్ 1 నుంచి ఇంటివద్దకే రేషన్

Door delivery of quality rice in AP: కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రజల ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చిలకలపూడి, బలరామునిపేట తదితర ప్రాంతాల్లో ఇంటి వద్దకే రేషన్‌ సరకుల పంపిణీ చేపట్టి, రెండో విడత బియ్యం పంపిణీని గురువారం మంత్రి ప్రారంభించారు. పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని, దానికి అనుగుణంగా నగరంలో ట్రయల్‌రన్‌ నిర్వహించగా స్పందన బాగుందన్నారు.

Also Read: గోవాలో ‘కోవ్యాక్సిన్’ హ్యుమన్ ట్రయల్స్ షురూ..