పుల్వామా ఘటనపై సరైన సమయంలో స్పందిస్తాం-ట్రంప్

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:50 PM

వాషింగ్టన్‌: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడిని భయానక చర్యగా అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. ఇండియా, పాకిస్థాన్ కలిసి నడిస్తే బాగుంటుంది’’ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. దాడులపై భారత్‌తో చర్చించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్‌ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామన్నారు. వైట్‌హౌస్‌లోని […]

పుల్వామా ఘటనపై సరైన సమయంలో స్పందిస్తాం-ట్రంప్
Follow us on

వాషింగ్టన్‌: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడిని భయానక చర్యగా అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. ఇండియా, పాకిస్థాన్ కలిసి నడిస్తే బాగుంటుంది’’ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. దాడులపై భారత్‌తో చర్చించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్‌ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామన్నారు. వైట్‌హౌస్‌లోని ఇతర విభాగాలు సైతం దాడిని తీవ్రంగా ఖండించాయి.