అమెరికా చరిత్రలో క్లైమాక్స్ ఎపిసోడ్, ఘ్జర్షణలు,హింసాత్మక ఘటనల తరువాత అధికార బదలాయింపునకు సిధ్ధం ట్రంప్ ప్రకటన.

అమెరికా చరిత్రలో క్లైమాక్స్ ఘట్టమిది ! ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోనని మొరాయించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చివరకు దాన్ని అంగీకరించక..

అమెరికా చరిత్రలో క్లైమాక్స్ ఎపిసోడ్, ఘ్జర్షణలు,హింసాత్మక ఘటనల తరువాత అధికార బదలాయింపునకు సిధ్ధం ట్రంప్ ప్రకటన.
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 07, 2021 | 5:56 PM

Donald Trump:  అమెరికా చరిత్రలో క్లైమాక్స్ ఘట్టమిది ! ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోనని మొరాయించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చివరకు దాన్ని అంగీకరించక తప్పలేదు. అధికార బదలాయింపునకు  సిధ్ధమని ఆయన ప్రకటించారు. ఇక అధ్యక్షునిగా పదవిని చేపట్టడానికి జో బైడెన్ కి మార్గం, సుగమమైంది. అయితే బుధవారం క్యాపిటల్ భవనం ముట్టడికోసం ట్రంప్ తన మద్దతుదారుల  చేత చేయించిన దాడులు,  నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పులు, బాష్ప వాయు ప్రయోగం వంటి హింసాత్మక ఘటనల్లో ఓ మహిళ సహా నలుగురు మృతి చెందడం ఈ దేశ చరిత్రలో బ్లాక్ హిస్టరీని సృష్టించాయి. ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ట్విటర్ ట్రంప్ ను తాత్కాలికంగా బ్యాన్ చేసిన నేపథ్యంలో ఆయన తన సోషల్ మీడియా డైరెక్టర్  డాన్ స్కాలినో ద్వారా ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. ఎన్నికల ఫలితం పట్ల తాను పూర్తిగా విభేదిస్తున్నానని, కానీ వాస్తవాలను  గ్రహించాక జనవరి 20 న ‘ఆర్దర్లీ ట్రాన్సిషన్ ‘ (అధికార బదలాయింపు) ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. న్యాయబధ్ధమైన ఓట్లను మాత్రమే లెక్కించేలా చూడాలని కోరుతూ జరిపే పోరాటాన్ని నేను కొనసాగిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు తెలిపానన్నారు.

ప్రెసిడెన్షియల్ హిస్టరీలో ఇది గ్రేటెస్ట్ ఫస్ట్ టర్మ్.. అమెరికాను మళ్ళీ గ్రేట్ గా చేయాలన్న మా పోరాటానికి ఇది నాంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా…. ట్రంప్ ను పదవికి అనర్హుడని ప్రకటించడానికి రాజ్యాంగంలోని 25 వ సవరణపై చర్చించాలని  ఈయన సొంత కేబినెట్టే యోచిస్తోంది.

Also Read:

Pranab Autobiography: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తాను వ్యతిరేకం.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయిందన్న…

Covaxin పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన…! కొవాగ్జిన్‌ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు

వరుస ఘటనలపై ఏపీ పోలీసులు అప్రమత్తం.. అన్ని ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా నేత్రం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu