Scholarship: అమ్మాయిలకు రూ.25,000 స్కాలర్ షిప్.. ఆ వయసు వారు మాత్రమే అర్హులు.. ఎలా అప్లై చేయాలంటే..

చాలా మంది అమ్మాయిలు తమకు నచ్చిన రంగంలో రాణించడానికి ఆర్థిక స్థోమత లేక వారి కళలను మధ్యలోనే ఆపేస్తుంటారు. అలాంటి వారికి ఇంటర్న్ శాల గుడ్ న్యూస్ చెప్పింది.

Scholarship: అమ్మాయిలకు రూ.25,000 స్కాలర్ షిప్.. ఆ వయసు వారు మాత్రమే అర్హులు.. ఎలా అప్లై చేయాలంటే..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 5:37 PM

చాలా మంది అమ్మాయిలు తమకు నచ్చిన రంగంలో రాణించడానికి ఆర్థిక స్థోమత లేక వారి కళలను మధ్యలోనే ఆపేస్తుంటారు. అలాంటి వారికి ఇంటర్న్ శాల గుడ్ న్యూస్ చెప్పింది. అమ్మాయిలు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి, వారి ప్రతిభను చూపించడానికి స్కాలర్‏షిప్‏లను అందించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇంటర్న్ శాల కెరియర్ స్కాలర్‏షిప్ ఫర్ గర్ల్స్ (icsg scholarship 2021) అనే పేరుతో స్కాలర్ షిప్ అందించనున్నట్లుగా తెలిపింది. కానీ ఇది అందరూ అమ్మాయిలకు కాదండోయ్. కేవలం 17 నుంచి 23 ఏళ్ళలోపు అమ్మాయిలు మాత్రమే అర్హులు. ఈ స్కాలర్ షిప్‏కు అప్లై చేసుకోవడానికి 2021 జనవరి 15 చివరితేదీ.

ఆటలు, చదువు, ఆర్ట్స్, ఇతర రంగాలకు చెందిన అమ్మాయిలైన అప్లై చేసుకున్నాక.. వారికి రూ.25,000 ఇంటర్న్ షిప్ చేయడానికి లేదా వారికి నచ్చిన రంగంలో ప్రాజెక్ట్ అలవెన్సుకు, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఎక్విప్‏మెంట్‏గా వాటిని అందించనుంది. ఈ స్కాలర్ షిప్ అప్లై చేసుకువాలంటే వారి వయసు 2020 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 23 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఇందులో నాలుగు అంశాలను బట్టి అర్హతగల వారిని ఎంపిక చేస్తారు. అందులో వారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, వారు ఎంచుకున్న రంగంలో సాధించిన విజయాలు, ఆ స్కాలర్ షిప్ ఎందుకు ఉపయోగిస్తారనే ఉద్దేశం, మరియు వారి అవసరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక విషయంలో ఎలాంటి నంబర్ లిమిట్ ఉండదు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://blog.internshala.com/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‏లైన్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అవసరమైన సర్టిఫికేట్లను చూపించిన తర్వాత, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరగా.. ఫారంలో రిఫరీని చేర్చిన తర్వాత.. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వారిని సంప్రదిస్తారు. అందులో ఎంపికైన వారి జాబితా విడుదల చేసి వారికి స్కాలర్ షిప్ అందజేస్తారు.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నెల రూ.15 వేల వరకు స్కాలర్ షిప్.. వారికి మాత్రమే ఛాన్స్..

పాకిస్తానీ గర్ల్ మలాలా యూసుఫ్ జాయ్ కి ‘స్కాలర్ షిప్ యాక్ట్’ బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం