AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ వీరాభిమాని కృష్ణ హఠాన్మరణం

అభిమానం ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. అలా అభిమానం ఎక్కువై తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ అభిమాని.

ట్రంప్ వీరాభిమాని కృష్ణ హఠాన్మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 2:34 PM

Share

Trump Fan death: అభిమానం ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. అలా అభిమానం ఎక్కువై తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ అభిమాని. తెలంగాణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీరాభిమాని కృష్ణ గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంకు చెందిన కృష్ణ, డొనాల్డ్‌ ట్రంప్‌కి వీరాభిమాని. ఇటీవల ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఆ రోజు నుంచి కృష్ణ నిద్రాహారాలు మాని‌ కుమిలిపోయాడు. ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నా ఈ అభిమాని మాత్రం కోలుకోలేకపోయాడు. ఈ క్రమంలో ట్రంప్ నామ జపం చేస్తూ కృష్ణ ప్రాణాలు వదిలాడు.

కాగా ట్రంప్‌కి వీరాభిమాని అయిన కృష్ణ 2017 దీపావళిలో తన ఇంట్లో ట్రంప్‌ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తరువాత తన ఇంటి ప్రాంగణంలో ట్రంప్ గుడిని కట్టాడు. అందులో ట్రంప్ విగ్రహం ఉండగా.. దానికి రోజూ పూజలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు పెట్టేవాడు. ఇక కృష్ణ గురించి ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ‘వంద కోట్ల భారతీయుల్లో క్రిష్‌ నా ప్రాణస్నేహితుడు. క్రిష్‌ నా అభిమాని. అతను నా ఫొటోల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తా” అని కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే.

Read More:

నీపై రెస్పెక్ట్‌ రోజురోజుకు పెరుగుతుంది.. రకుల్‌పై క్రిష్‌ ప్రశంసలు

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పునరాలోచనలో టీటీడీ.. రేపు తుది నిర్ణయం

Follow Us
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..