Disha Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. గురువారం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ప్రసవం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. శుక్రవారం బిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిశ కేసులో చెన్నకేశవులు ఏ2గా ఉన్నాడు. ఇక దిశ ఘటన సమయంలో రేణుక గర్భవతిగా ఉన్న విషయం విదితమే.
కాగా, దిశ ఘటనలో చెన్నకేశవులు, మిగిలిన ముగ్గురు నిందితులను పోలీసులు గతేడాది డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్ చేశారు. కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేయడంతో వారు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై రేణుక సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు ఈ ఘటనపై కేసు కూడా నమోదు కావడంతో నిందితుల అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.
ఇక డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. ఇద్దరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. వీరికి ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ముందుకు రావాలని కోరారు’.
For More News:
బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..
‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…
మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్లపై నిషేధం…
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల
బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్
తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?
విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..
హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?
సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!