‘దిశ’ సినిమాకోసం వర్మ రెడీ ! రేపిస్టు భార్యతో మాటామంతీ !

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని తీసేందుకు రెడీ అయ్యారన్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తాను నిర్మించే చిత్రాలకు ముందు సంబంధిత వ్యక్తులను వర్మ కలుసుకుని తన కథకు మరింత బలం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ‘వంగవీటి’ సినిమా కోసం విజయవాడలో రాజకీయ నేత వంగవీటి రాధాను కలిసి బెజవాడ పాలిటిక్స్ ని, వంగవీటి కుటుంబ నేపథ్యాన్ని […]

'దిశ' సినిమాకోసం వర్మ రెడీ ! రేపిస్టు భార్యతో మాటామంతీ !

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని తీసేందుకు రెడీ అయ్యారన్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తాను నిర్మించే చిత్రాలకు ముందు సంబంధిత వ్యక్తులను వర్మ కలుసుకుని తన కథకు మరింత బలం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ‘వంగవీటి’ సినిమా కోసం విజయవాడలో రాజకీయ నేత వంగవీటి రాధాను కలిసి బెజవాడ పాలిటిక్స్ ని, వంగవీటి కుటుంబ నేపథ్యాన్ని అవగాహన చేసుకుని చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా అదే శైలితో ‘దిశ’ మూవీ కోసం ఆయన అదే ప్లాన్ చేస్తున్నారు.. దిశ రేపిస్టుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకను  ఆయన తన ఆఫీసుకు పిలిపించుకుని కీలక విషయాలు అడిగి తెలుకున్నట్టు తెలుస్తోంది. 16 ఏళ్ళ వయస్సులోనే రేణుక చెన్నకేశవులును పెళ్లి చేసుకుందట. (దిశ హత్యాచార ఘటనలో రేపిస్టు చెన్నకేశవులును, మరో ముగ్గురిని  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు). 17 ఏళ్లకే రేణుక ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.

‘దిశనే కాదు.. ఆ రాక్షసుడు రేణుకను కూడా మోసం చేశాడు.. ఈమె ఇంకా చిన్నపిల్ల.. అలాంటిది ఈమె త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. వీరిద్దరికీ భవిష్యత్తు లేదు’ అని వర్మ చెన్నకేశవులుపై మండిపడుతూనే.. రేణుక మీద జాలి చూపారు. ఇక తన తాజా సినిమా ‘దిశ’ అని,  ఆ రేప్ ఘటన గురించి తన చిత్రం ఉండబోతోందని ఆయన తెలిపారు. ఈ చిత్రం రేపిస్టులకు ఓ గుణపాఠంగా ఉండబోతోందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Published On - 2:39 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu