టాలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘సూపర్’ చిత్రంతో.. సినీ సిండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్వీటీ అలియాస్ అనుష్క. అనంతరం తన గ్లామర్ షోతో ఎన్నో సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ‘అరుంధతి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లోని దాదాపు అందరి అగ్ర హీరోలతో నటించి మెప్పింది. కాగా సూపర్ సినిమా విడుదలై ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా డైరెక్టర్ పూరీ అనుష్కను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.
‘ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు. మా అనుష్క మొదటి సినిమా ‘సూపర్’ రిలీజ్ అయిన రోజు ఈ రోజే. ‘సూపర్ నుండి నిశ్శబ్దం’ వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చుస్తే నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది. మనస్ఫూర్తిగా నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా అంటూ పూరీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే స్వీటీ నటించిన నిశ్శబ్దం టీమ్‌కి, ఆ చిత్ర డైరెక్టర్‌కి శుభాకాంక్షలు తెలిపారు’ పూరీ. కాగా అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అయ్యేంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు @iamnagarjuna మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చుస్తే ఐ feel proud . You will rock more with #nishabdam @hemantmadhukar pic.twitter.com/B42Sqj3BhN
— PURIJAGAN (@purijagan) July 22, 2020
Read More:
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం..
షిర్డీ సాయిబాబా దర్శన భాగ్యం ఎప్పుడంటే?
వాట్సాప్‌లో మరిన్ని సేవలు.. త్వరలోనే పెన్షన్ సర్వీసులు కూడా!