SVPNA: జాతీయ పోలీస్‌ అకాడమీలో ఘనంగా దీక్షాంత్‌ సమారోహ్‌.. హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి..

Dikshant Parade 2021: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌ఏ) లో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ

SVPNA: జాతీయ పోలీస్‌ అకాడమీలో ఘనంగా దీక్షాంత్‌ సమారోహ్‌.. హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి..
Dikshant Parade 2021

Updated on: Aug 06, 2021 | 9:01 AM

Dikshant Parade 2021: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌ఏ) లో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు శుక్రవారం దీక్షాంత్‌ సమారోహ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద్ శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. దీక్షాంత్‌ సమారోహ్‌ సందర్భంగా శిక్షణ పొందిన 178 మంది పరేడ్‌ నిర్వహించారు.

Dikshant Parade

శిక్షణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్‌ ఆఫీసర్స్‌ ఉన్నారు. 144 మంది ఐపీఎస్‌లలో 23 మంది మహిళలు ఉన్నారు. కాగా.. శిక్షణ పూర్తయిన ఐపీఎస్‌లలో తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మందిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నలుగురు చొప్పున అధికారులను కేటాయించారు.

Also Read:

Hyderabad: మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు యువతులు సహా 8 మంది అరెస్ట్

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..