బిగ్ బాష్ లీగ్‌లో మెరవనున్న భారత క్రికెటర్లు.. వారెవారంటే.!

|

Oct 25, 2020 | 7:33 PM

ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఆస్ట్రేలియా వేదికగా మరో పొట్టి క్రికెట్ మొదలు కానుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నమెంట్ ఆరంభం

బిగ్ బాష్ లీగ్‌లో మెరవనున్న భారత క్రికెటర్లు.. వారెవారంటే.!
Follow us on

Big Bash League: ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఆస్ట్రేలియా వేదికగా మరో పొట్టి క్రికెట్ మొదలు కానుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నమెంట్ ఆరంభం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టోర్నీలో ప్రతీ టీం ముగ్గురు విదేశీ ప్లేయర్స్‌ను ఆడించడానికి ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీనితో ఈసారి విదేశీ ప్లేయర్స్ సంఖ్య పెరగనుంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ లీగ్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి కొంతమంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోని, యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్పలు కూడా బీబీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..