అక్కడ ‘ధన్వంతరి రథ్’ ద్వారా వైద్య సేవలు..!
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల నివాస కాలనీలలో ఆయుర్వేద నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సేవలను విస్తరించడానికి
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల నివాస కాలనీలలో ఆయుర్వేద నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సేవలను విస్తరించడానికి వీలుగా, అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏ.ఐ.ఐ.ఏ) ఢిల్లీ పోలీసు శాఖ మంగళవారం ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మద్దతుతో, ‘ధన్వంతరీ రథ్’ పోలీస్ వెల్నెస్ సెంటర్ల ద్వారా, ఏ.ఐ.ఐ.ఏ. ఈ సేవలను అందిస్తుంది. ఢిల్లీ పోలీసు కమిషనర ఎస్.ఎన్. శ్రీవాస్తవ ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రమోద్ కుమార్ పాథక్ సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు.
వివరాల్లోకెళితే.. కరోనా కట్టడికోసం.. ఆయుర్వేద రోగనిరోధక శక్తిని పెంచే చర్యల ద్వారా ఢిల్లీ పోలీసుల వంటి ఫ్రంట్‌లైన్ కోవిడ్ యోధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్న ఏ.ఐ.ఐ.ఏ. ఢిల్లీ పోలీసు శాఖ మధ్య జాయింట్ వెంచర్ “ఆయురక్ష” ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కు కొనసాగింపుగా, ఇప్పుడు, ఆయుర్వేద నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య పరిరక్షణ సేవలను ఢిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలకు విస్తరించాలని నిర్ణయించారు.