‘నువ్వా.. నేనా’ అనేట్టుగా ‘మైలవరం’ పంచాయితీ

కృష్ణాజిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మైలవరం కేంద్రంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తుత ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:27 pm, Thu, 3 September 20
'నువ్వా.. నేనా' అనేట్టుగా 'మైలవరం' పంచాయితీ

కృష్ణాజిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మైలవరం కేంద్రంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తుత ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైలవరం రాజకీయం అవినీతి చుట్టూ తిరుగుతోందంటూ విమర్శలు గుప్పించారు. వసంతపై ఒక రేంజ్ లో ఫైరయ్యారు. దీనికి అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు వసంత. ఉమ హయాంలోనే అక్రమాలన్నీ జరిగాయన్నారు. ఇక.. ACB దాడుల్లోనే కృష్ణప్రసాద్‌ మనుషుల బండారం బయటపడిందని ఉమ ఆరోపిస్తే.. అసలు 2014 నుంచి జరిగిన వ్యవహారాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్‌ చేశారు కృష్ణప్రసాద్‌. వారిద్దరి మాటల యుద్ధాన్ని చూద్దాం.