గుడ్‌న్యూస్‌.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. అదేంటంటే రాష్ట్రంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది

  • Tv9 Telugu
  • Publish Date - 6:40 pm, Thu, 3 September 20
గుడ్‌న్యూస్‌.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

AP Corona Updates: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. అదేంటంటే రాష్ట్రంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అలాగే యాక్టివ్‌ కేసులు, మరణాల్లోనూ తగ్గుదల కనిపిస్తోందని.. ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల్లో ప్రతి రోజు 13.7 శాతం తగ్గుతుందని, కరోనా మరణాల్లోనూ 4.5 శాతం తగ్గుదల ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రోజు వారీ కరోనా కేసుల్లో దేశ వ్యాప్తంగా ఏపీ రెండో స్థానంలో ఉన్నా.. రికవరీ రేటులో మాత్రం ముందజలో ఉన్నట్లు తెలిపింది.

ఇక దేశంలోనూ పాజిటివ్ రేటు తగ్గుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ రేటు 1.75శాతానికి ప‌డిపోగా, రిక‌వ‌రీ రేటు కూడా 77.09శాతంగా ఉంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు రోజుకు ప‌దుల సంఖ్య‌లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు..  ఇప్పుడు రోజుకు లక్షల్లో జరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పుడు రోజూవారి నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు తగ్గుతుండటంతో పాటు మ‌ర‌ణాల రేటు కూడా త‌గ్గ‌డం సానుకూలమైన అంశమని కేంద్ర‌వైద్యారోగ్య‌శాఖ వివరించింది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 10,199 కొత్త కేసులు.. 75 మరణాలు

రమేష్‌ ఆసుపత్రిపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం