కరోనా విలయం: తెలంగాణలో మరో పోలీస్ అధికారి బలి..
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది...మొన్నటి వరకు కాస్త తగ్గినట్టుగానే కనిపించిన పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. మరోవైపు.. మంత్రులు, అధికారులు, లీడర్లు.. ఇలా ప్రముఖులను కూడా కరోనా వదలడంలేదు.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది…మొన్నటి వరకు కాస్త తగ్గినట్టుగానే కనిపించిన పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. మరోవైపు.. మంత్రులు, అధికారులు, లీడర్లు.. ఇలా ప్రముఖులను కూడా కరోనా వదలడంలేదు. కోవిడ్ బారినపడి సామాన్యులతో పాటుగానే ఫ్రంట్ వారియర్స్‌గా పోరాటం చేస్తున్న వైద్యసిబ్బంది, పోలీసుల్లో కూడా ప్రాణాలు తీస్తోంది కరోనా వైరస్… ఇప్పటికే పలువురు నేతలు, అధికారులు కరోనాతో మృతిచెందగా… తాజాగా, తెలంగాణలో మరో అధికారి కరోనా కాటుకు బలయ్యారు. ఈ నెల 18వ తేదీన కరోనా సోకడంతో మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మియపూర్ ఏఎస్‌ఐ విశ్వనాథం మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. విశ్వనాథం మృతితో ఆయన స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా జీనసంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




