Devarakonda Fighter Movie: ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విజయ్ దేవరకొండకు పూర్తి నిరాశే కలిగించింది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి ప్యాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫైటర్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా తెలుగులో అరంగేట్రం చేయనుంది. అంతేకాక ఈ సినిమా కోసమే విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకున్నాడు. హీరో హీరోయిన్లు ఒక బైక్ సీక్వెన్స్ సీన్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్న ‘ఫైటర్’తో విజయ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.
For More News:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!
యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!
భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!
అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!
వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?