ఢిల్లీలో ఎముకలు కొరికే చలి… ఎదుట ఏముందో కనిపించని స్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు రైతుల ఆందోళన కొనసాగుతోంది.. మరోవైపు చలి పులి పంజా విసురుతోంది. అక్కడ రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజధానివాసులు జనాలు చలికి అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం మంచుదుప్పటి కప్పేసింది.

Dense Fog In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు రైతుల ఆందోళన కొనసాగుతోంది.. మరోవైపు చలి పులి పంజా విసురుతోంది. అక్కడ రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజధానివాసులు జనాలు చలికి అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం మంచుదుప్పటి కప్పేసింది. ఉదయం తొమ్మిది పదిదాకా కనీసం ఎదుట ఏముందో కనిపించని పరిస్థితి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.
మంచు తీవ్రంగా కురుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉండనుంది. అంతేకాదు గాలిలో నాణ్యత కూడా విపరీతంగా తగ్గింది. అసలే కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ మొదలవడంతో అక్కడ వైరస్ విజృంభణ కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. ఉదయం 6.30 నుంచి 9 గంటల మధ్య విజబులిటీ జీరోగా ఉంటోంది. ఉదయం 9 గంటల తర్వాత ఇక్కడ 50 మీటర్లకు విజబులిటీ వస్తోంది. ఆ తర్వాత 300 మీటర్లకు విజబులిటీ పెరుగుతోంది. “హిమాలయాల నుంచి చల్లటి గాలులు వేగంగా వీస్తుండటం వల్లే ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గతనెలలలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
