Coronavirus In Delhi: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా1,300 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదివారంనాడు తెలిపారు. ఇంతవరకూ రాష్ట్రంలో 1,45,427 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇందులో 10,729 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 4,111కి చేరింది. ‘కోవిడ్-19 కేసులు పెరగడానికి ఢిల్లీ బయట నుంచి అనేక మంది ఇక్కడ పరీక్షలు చేయించుకునేందుకు వస్తుండటమే కారణం అని సత్యేంద్ర జైన్ అన్నారు.
Read More:
30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!
ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!