Delhi Recorded Lowest temperature: కొత్తేడాది ప్రారంభం రోజున దేశ రాజధాని ఢిల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత తగ్గడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఏకంగా 1.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ వద్ద శుక్రవారం ఉదయం అత్యల్పంగా 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో నగర వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా డీఎన్డీ ఫ్లైఓవర్‌పై రోడ్డు కనిపించని పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉంటే 2006 జనవరి 8న అత్యల్పంగా 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదుకాగా ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అంతకంటే తక్కువ నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఉదయం ఏడు గంటల వరకు కూడా రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ఏడు తర్వాత కానీ కాస్త రోడ్డు కనిపించలేదు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.