దేశ వ్యాప్తంగా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అంతకంతకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 73 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1400కి చేరింది. ఇక ఇవాళ కొత్తగా 1,647 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,829కి చేరింది. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. పార్టీలకతీతంగా కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనుంది కేంద్రం.