కరోనా వికృతరూపంతో దేశం అల్లాడిపోతోంది. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనిగ, ఇవాళ 29 మంది మృతి చెందినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవాళ మొత్తంగా 1,532 మంది కరోనా నుంచి వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,26,323కి చేరింది. ఇక ఇప్పటివరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 3,719 మంది ప్రాణాలొదిలారు. ఇప్పటి వరకు చికిత్స పూర్తిచేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,07,650 కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 14,954గా ఉంది. ఢిల్లీ వ్యాప్తంగా 8,71,371 మందికి కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ప్రస్తుతం 7,966 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా, అటు, కరోనా రోగులు 15,475 వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రతి మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్‌ల సంఖ్య 45,861గా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.