వ్యాక్సిన్ వచ్చేవరకు ఇలా చేయండి…: ప్రజలకు ఢిల్లీ మంత్రి విజ్ఞప్తి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 5,673 పాజిటివ్ కేసులు న‌మోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ఢిల్లీలో మూడ‌వ ద‌ఫా వైర‌స్ కేసుల విజృంభ‌ణ మొద‌లైందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి...

  • Sanjay Kasula
  • Publish Date - 12:57 pm, Fri, 30 October 20
వ్యాక్సిన్ వచ్చేవరకు ఇలా చేయండి...: ప్రజలకు ఢిల్లీ మంత్రి విజ్ఞప్తి

Mask as If They Were Vaccinated : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్ పాజిటివ్ కేసులతో అక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చెప్పాలంటే అక్కడి ఆస్పత్రుల్లోని  35 శాతం బెడ్లు కొవిడ్ బాధితులతో ఫుల్ అయ్యాయి.

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 5,673 పాజిటివ్ కేసులు న‌మోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ఢిల్లీలో మూడ‌వ ద‌ఫా వైర‌స్ కేసుల విజృంభ‌ణ మొద‌లైందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు మాస్కులు తప్పని సరిగా ధ‌రించాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ మాస్కును వ్యాక్సిన్‌గా ప‌రిగ‌ణించాల‌ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ఢిల్లీ ప్రజలకు సూచించారు. మాస్కు ధ‌రిస్తే అటు వైర‌స్ నుంచి, ఇటు కాలుష్యం నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల ప్రజల మధ్య సంబంధాలు పెరిగి పోవడమే ఇందుకు కారణమని అభిప్రాయ పడ్డారు.