వ్యవసాయ చట్టాలకు మా మద్దతు..కేంద్ర మంత్రిని కలిసిన రైతు సంఘాలు…రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారన్న రైతు సంఘం నేత

|

Dec 08, 2020 | 5:03 AM

మూడు వ్యవసాయ చట్టాలను సవరణలతో సహా కొనసాగించాలని హర్ కిసాన్, హర్యానా ప్రగతిషీల్ కిసాన్ సంఘం, హర్యానా కిసాన్ సంఘం కోరాయి. ఈ మేరకు ఆ సంఘాల రైతు నేతలు సంతకాలు చేస్తూ ఒక వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు సమర్పించాయి...

వ్యవసాయ చట్టాలకు మా మద్దతు..కేంద్ర మంత్రిని కలిసిన రైతు సంఘాలు...రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారన్న రైతు సంఘం నేత
Follow us on

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆందోళనలు చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక దేశంలోని రైతు సంఘాలు కూడా ఇదే బాటలో పయణిస్తున్నాయి.

అయితే హర్యానాకు చెందిన కొన్ని రైతు సంఘాలు ఈ చట్టాలకు మద్దతు పలికాయి. 20 మంది రైతు నేతలతో కూడిన ఓ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను సమావేశం అయ్యింది. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది.

మూడు వ్యవసాయ చట్టాలను సవరణలతో సహా కొనసాగించాలని హర్ కిసాన్, హర్యానా ప్రగతిషీల్ కిసాన్ సంఘం, హర్యానా కిసాన్ సంఘం కోరాయి. ఈ మేరకు ఆ సంఘాల రైతు నేతలు సంతకాలు చేస్తూ ఒక వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు సమర్పించాయి.

అనంతరం ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ క్లబ్ అధ్యక్షుడు కన్వాల్ సింగ్ చౌహాన్ చట్టంలో తీసుకుకొచ్చిన మార్పులను వివరించారు. నిరసన తెలుపుతున్న రైతులను కొందరు రాజకీయ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థ కొనసాగుతుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.