ఆటగాళ్లకు రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ముంబై ఇండియన్స్
కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ యూఏఈ వేదికగా మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతేపైనే బీసీసీఐ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే అక్కడికి వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా రావడంతో మిగిత జట్లు జాగ్రత్తలపై మరింత దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లకు ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చింది. అది తమ జట్టు సభ్యులకు ఎంతో ప్రత్యేకమని పేర్కొంది.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టు సభ్యులకు స్మార్ట్ ఫింగర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ రింగ్స్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయట. ఆ జట్టు సభ్యలు ఈ ఉంగరాలను నిత్యం ధరించి ఉండాల్సి ఉంటుంది.
వీటితో ఆటగాళ్ల గుండె వేగం, శ్వాసలో హెచ్చుతగ్గులు, శరీర ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని స్వేకరించవచ్చట. అందులో వారికి ఏమైనా తేడాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంఐఈ ఏర్పాట్లు చేసింది.
ఇక సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.