అయోధ్యలో అయిదున్నర లక్షల దీపాలతో దీపోత్సవం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి పండుగ రోజున జరిపే దీపోత్సవ్ ఈసారి మరింత శోభాయమానంగా ఉండబోతున్నది.. 2017 నుంచి జరుగుతున్న గొప్ప వేడుకే అయినప్పటికీ ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు.. కన్నులపండుగగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు.. ఈసారి 5.51 లక్షల దీపాలతో దీపోత్సవ్‌ను నిర్వహించబోతున్నారు. అయితే కరోనా నిబంధనల మేరకే దీపావళి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. దీపోత్సవానికి ఇప్పటి నుంచే అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. అయోధ్యలోని రామ్‌కి పైడి ఘాట్‌ల దగ్గర 5.51 లక్షల […]
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి పండుగ రోజున జరిపే దీపోత్సవ్ ఈసారి మరింత శోభాయమానంగా ఉండబోతున్నది.. 2017 నుంచి జరుగుతున్న గొప్ప వేడుకే అయినప్పటికీ ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు.. కన్నులపండుగగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు.. ఈసారి 5.51 లక్షల దీపాలతో దీపోత్సవ్‌ను నిర్వహించబోతున్నారు. అయితే కరోనా నిబంధనల మేరకే దీపావళి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. దీపోత్సవానికి ఇప్పటి నుంచే అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. అయోధ్యలోని రామ్‌కి పైడి ఘాట్‌ల దగ్గర 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగిస్తామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రామ్‌జన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి దీపోత్సవం కాబట్టి గ్రాండ్‌గా చేద్దామనుకుంటోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కరోనా వైరస్ ఒకటి తగలబడింది కానీ లేకపోతే ఈ వేడుకలకు కోటిమందికి పైగా వచ్చేవారని చెబుతోంది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు అయోధ్యకు రావద్దని, డిజిటల్‌గా ప్రత్యక్ష ప్రసారంలో చూసి ఆనందించండని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నీటకంఠ తివారి చెబుతున్నారు. దీపోత్సవ్ 2020ను ఈ నెల 12 నుంచి 16 వరకు జరుగుతుంది.