ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: మంత్రికి గుడ్ బై చెప్పిన యోగి

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీ శ్రేణుల్లో చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రావడంతో  ఆ పార్టీలో జోష్‌ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డ తెల్లారే యూపీలో అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు కేబినెట్ హోదా తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌ను […]

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: మంత్రికి గుడ్ బై చెప్పిన యోగి
Follow us

|

Updated on: May 20, 2019 | 3:12 PM

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీ శ్రేణుల్లో చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రావడంతో  ఆ పార్టీలో జోష్‌ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డ తెల్లారే యూపీలో అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు కేబినెట్ హోదా తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో రాజబర్‌కు, బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆయన తన మంత్రి పదవికి ఏప్రిల్‌ 13నే రాజీనామా చేశారు. బీజేపీ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీచేయాలని కోరిందని, తాను తన సొంత పార్టీ గుర్తుపై బరిలోకి దిగుతానని చెప్పానని, దానికి బీజేపీ నో చెప్పడంతో.. మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గతంలో వివరణ ఇచ్చారు.

అయితే, యోగి నిర్ణయాన్ని రాజ్‌బర్ స్వాగతించారు. మొదట సామాజిక న్యాయ కమిటీని ఏర్పాటు చేసి. తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఆ రిపోర్ట్‌లోని మార్గదర్శకాలను అమలుచేసేందుకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఎంత‌ వేగంగా నిర్ణయం తీసుకున్నారో అంతేవేగంగా ఆ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!