హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ యాక్సిడెంట్ చేశాడని ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని నిన్నటి నుంచి పలు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దగ్గుబాటి కుటుంబ సభ్యులు స్పందించారు. కార్ యాక్సిడెంట్‌కీ, దగ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదనీ, అసలు అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని వారు స్పష్టం చేశారు.
బుధవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురైందని, ఎదురుగా వస్తోన్న కారుని, ఆయన కారు ఢీ కొట్టిందని మీడియాలో, సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి కేవలం వదంతులు మాత్రమేనని, మీడియాలో చూపిస్తున్న కారు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందినది కాదని పేర్కొన్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు.
కాగా ఇటీవలే ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా, మిహీకా బజాబ్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో దయచేసి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని వారు కోరారు.
Read More:
ఈ రోజు రాత్రి 8 గంటలకు మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
బిగ్‌బాస్ సీజన్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జరుగుతుందో?