ముంబైలో ‘ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ‘ అరెస్ట్.. కన్నడనాట సీనియర్ నేతలు కూడా..

| Edited By: Srinu

Jul 10, 2019 | 5:23 PM

‘ కర్ణాటక రాజకీయం ‘ ముంబైలో ఇంకా కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గరినుంచి కదలడానికి కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ నిరాకరించడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. శివకుమార్ ను కలిసేందుకు అక్కడికి చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవర, మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్ ను కూడా వారు అదుపులోకి తీసుకుని కలీనా యూనివర్సిటీ రెస్ట్ హౌస్ కి తరలించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. […]

ముంబైలో  కాంగ్రెస్ ట్రబుల్ షూటర్  అరెస్ట్.. కన్నడనాట సీనియర్ నేతలు కూడా..
Follow us on

‘ కర్ణాటక రాజకీయం ‘ ముంబైలో ఇంకా కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గరినుంచి కదలడానికి కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ నిరాకరించడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. శివకుమార్ ను కలిసేందుకు అక్కడికి చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవర, మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్ ను కూడా వారు అదుపులోకి తీసుకుని కలీనా యూనివర్సిటీ రెస్ట్ హౌస్ కి తరలించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇక బెంగుళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను కూడా ఖాకీలు అరెస్టు చేశారు. ముంబైలో శివకుమార్ ను ఓ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేయబోగా పోలీసులు ఆయనను దురుసుగా పక్కకు లాగేశారు. ఈ ప్రభుత్వం తమపై పోలీసు బలప్రయోగానికి ఆదేశించడం సిగ్గుచేటని శివకుమార్ మండిపడ్డారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాజకీయాలపై కన్నేసి..కేంద్ర ఆదేశాలతో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

హోటల్లో బస చేసిన తన మిత్రులను కలుసుకోకుండా తాను వదిలివెళ్లేది లేదని, వాళ్ళు తనను ఆహ్వానిస్తున్నారని, తను వెళ్లకపోతే వారెంతో బాధపడతారని శివకుమార్ పోలీసుల వద్ద సెంటిమెంట్లు గుప్పించారు. పైగా తనకు హృదయం (గుండె) ఉందిగానీ, తన వద్ద ఆయుధాలు లేవని సెటైర్ వేశారు. అటు హోటల్లో ‘ దాగిన ‘ రెబల్ సభ్యులు కూడా..తమకు శివకుమార్ పై నమ్మకం ఉందని, కానీ తప్పనిసరై ఈ చర్య చేపట్టామని సన్నాయినొక్కులు నొక్కారు. స్నేహం, అభిమానం, ప్రేమ ఒకవైపు… కృతజ్ఞత, గౌరవం మరోవైపు..వీటితో తాము ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, దయచేసి శివకుమార్ ను ఇక్కడినుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నామని వారు కూడా తమ స్టయిల్లో వ్యాఖ్యానించారు. ముంబైలో వర్షం పడుతున్నా శివకుమార్, ఆయన మద్దతుదారులు ఆ హోటల్ దగ్గరినుంచి కదలకపోవడం విశేషం.