ఏపీ సరిహద్దు దాటిన ‘ఫొని’..శ్రీకాకుళంకు ముప్పు తప్పినట్లే..

|

May 03, 2019 | 10:23 AM

తూర్పు తీరంపై ప్రచండ తుఫాన్ పడగవిప్పింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తుఫాన్ గమనాన్ని ఆర్టీజీఎస్ పరిశీలిస్తోంది. దానికి అనుగుణంగా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం ఏపీ సరిహద్దు దాటిన ‘ఫొని’..పూరీ వైపు పయనిస్తోంది. గంటకు 15 కి.మీ దూరంలో ముందుకు కదులుతున్న తుఫాన్…పూరీకి దక్షిణంగా 80. కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉదయం 10.30-11.30 మధ్య […]

ఏపీ సరిహద్దు దాటిన ఫొని..శ్రీకాకుళంకు ముప్పు తప్పినట్లే..
Follow us on

తూర్పు తీరంపై ప్రచండ తుఫాన్ పడగవిప్పింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తుఫాన్ గమనాన్ని ఆర్టీజీఎస్ పరిశీలిస్తోంది. దానికి అనుగుణంగా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం ఏపీ సరిహద్దు దాటిన ‘ఫొని’..పూరీ వైపు పయనిస్తోంది. గంటకు 15 కి.మీ దూరంలో ముందుకు కదులుతున్న తుఫాన్…పూరీకి దక్షిణంగా 80. కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉదయం 10.30-11.30 మధ్య పూరీ వద్ద తీరం దాటనుంది ‘ఫొని’.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. కంచిలిలో గరిష్ఠంగా 10 సెం.మీ., సోంపేటలో 10 సెం.మీ. వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. ఫణి ఏపీ సరిహద్దు దాటటంతో శ్రీకాకుళం జిల్లాకు ముప్పుతప్పినట్లేనని తెలిపారు. ఐతే ఒడిశాలో 20 సెం.మీ. మేర వర్షం కురిసే అవకాశముందని..దాని వలన వరదలు ముంచెత్తే ప్రమాదముందని భావిస్తున్నారు. దాని ప్రభావం శ్రీకాకుళం జిల్లాపైనా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు, అధికారులు ఎటువంటి ఉపశమనం ఫీల్ అవ్వకుండా జాగ్రత్త వహించాలని ఆర్టీజీఎస్ అపిషీయల్స్ చెప్తున్నారు.