సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్న ఫొని
ఫొని తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రానికి ఇది తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య ఫొని తుఫాన్ తీరం దాటే అవకాశముంది. దిశ మారితే మయన్మార్ మీదుగా.. బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో నాగపట్నం, కడలూరు, రామేశ్వరానికి చెందిన జాలర్లు తీరానికి రావాలని కోస్ట్‌గార్డు సిబ్బంది సమాచారం ఇచ్చారు. సముద్రంలోకి చేపల వేటకు మొత్తం 2వేల మంది మత్స్యకారులు వెళ్లారు. అందులో 800 […]
ఫొని తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రానికి ఇది తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య ఫొని తుఫాన్ తీరం దాటే అవకాశముంది. దిశ మారితే మయన్మార్ మీదుగా.. బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో నాగపట్నం, కడలూరు, రామేశ్వరానికి చెందిన జాలర్లు తీరానికి రావాలని కోస్ట్‌గార్డు సిబ్బంది సమాచారం ఇచ్చారు. సముద్రంలోకి చేపల వేటకు మొత్తం 2వేల మంది మత్స్యకారులు వెళ్లారు. అందులో 800 మంది తీరానికి చేరుకోగా.. మరో 1200 మంది రావాల్సి ఉంది.