ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఇన్‌స్టాంట్‌’ పదంలో మోసం ఉందంటున్న సీపీ సజ్జనార్

|

Jan 05, 2021 | 7:41 PM

హైదరాబాద్ లో నకిలీ ఇన్సూరెన్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాను అరెస్ట్ చేసిన తరువాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయంపై ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.

ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ఇన్‌స్టాంట్‌ పదంలో మోసం ఉందంటున్న సీపీ సజ్జనార్
Follow us on

Fake Insurance Gang : ఇన్‌స్టాంట్‌..  ఈ పదంలోనే మోసం ఉందంటున్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌. తాజాగా ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠాను పట్టుకున్న తర్వాత ఆయన చేసిన కామెంట్ ఇలా ఉంది. ముఠాను అరెస్ట్ చేసిన తరువాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయంపై ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీలను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషర్ సజ్జనార్ పేర్కొన్నారు. వేలాదిగా బీమా కాపీలు అమ్మేసిన వీళ్ల నుంచి ప్రస్తుతానికి వెయ్యికిపైగా నకిలీ పత్రాలను, మొబైల్‌ ఫోన్లను సీజ్ చేసినట్లుగా తెలిపారు.

పలు కంపెనీలకు సంబంధించిన నకిలీ లేబుల్స్, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ ఇన్సూరెన్స్ ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు రమేష్ కు కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రమేష్ పొల్యూషన్ వెహికిల్ ను నిర్వహిస్తున్నారని, ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

రోడ్డు పక్కన, ఆర్టీఏ ఆఫీస్‌ల పక్కన పొల్యూషన్‌ చెకింగ్ వెహికిల్‌ను ముందుగా ఏర్పాటు చేసుకుంటుంది ఈ ముఠా. పొల్యూషన్ సర్టిఫికెట్‌ కోసం వచ్చే వాళ్లకు మాయమాటలు చెప్పి ఇన్సూరెన్స్‌లు అమ్ముతారు. 10వేల ఇన్సూరెన్స్‌ను తమ ద్వారా వెళ్తే రెండువేలకే వస్తుందని నమ్మబలుకుతారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అన్ని సంస్థలకు చెందిన ఇన్సూరెన్స్ కాపీలు చూపించి వంచిస్తారు. ఓకే చెప్పామో లేదో వేడివేడిగా జిరాక్స్ తీసి ఇచ్చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి క్లెయిమ్‌కి వెళ్లినప్పుడు తెలుస్తుంది.. మోసపోయాయని. 2016లో బీదర్‌లో జరిగిన ఓ ప్రమాదం తర్వాత ఈ ముఠా చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. సో బీకేర్‌ఫుల్ అంటున్నారు సజ్జనార్‌. ఇన్‌స్టాంట్ అనే పదాన్ని పొరపాటున కూడా నమ్మొద్దంటున్నారు.

ఇవి కూడా చదవండి…

Bird Flu Scare : దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా? ఎలా ఉడికించాలి.. ఎలా తినాలి.!
Parliament Budget Session : ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. ఆ నిబంధనలు తప్పవంటున్న అధికారులు..