Parliament Budget Session : ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. ఆ నిబంధనలు తప్పవంటున్న అధికారులు..

ఈనెల 29న పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మలి దశలో మార్చి 8..

Parliament Budget Session : ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. ఆ నిబంధనలు తప్పవంటున్న అధికారులు..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2021 | 5:27 PM

Parliament Budget Session : ఈనెల 29న పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మలి దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్​ 8 వరకు సభ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.

సీసీపీఏ సిఫార్సుల ప్రకారం.. ఈనెల 29న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం సార్వత్రిక పద్దును ప్రవేశపెడుతుంది. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కరోనా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్​ సెసన్స్​​ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణులు, వాణిజ్యవేత్తలతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ సమావేశం అయ్యారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై కేంద్ర కేబినెట్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.