డేటింగ్ పేరుతో లూఠీ, కాల్ చేస్తే బుక్కైనట్లే

|

Sep 16, 2020 | 2:21 PM

భౌతిక దొంగతనాలు, చోరీలు ఇప్పుడు తగ్గిపోయాయి. సీసీ కెమెరాల నిర్వహణ, పోలీసుల నిరంతర గస్తీ, ప్రజల అప్రమత్తతో చాలా వరకు దొంగతనాలు తగ్గిపోయాయి.

డేటింగ్ పేరుతో లూఠీ, కాల్ చేస్తే బుక్కైనట్లే
Follow us on

భౌతిక దొంగతనాలు, చోరీలు ఇప్పుడు తగ్గిపోయాయి. సీసీ కెమెరాల నిర్వహణ, పోలీసుల నిరంతర గస్తీ, ప్రజల అప్రమత్తతో చాలా వరకు దొంగతనాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలు పద్దతుల్లో అకౌంట్లలో డబ్బు దోచేస్తున్నారు.ఇలా కూడా దోచుకుంటారా అని పోలీసులు విస్తపోయేలా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా అబ్బాయిలకు అందమైన యువతులతో మీటింగ్, డేటింగ్‌ కల్పిస్తామంటూ నమ్మించి లక్షల్లో దోపిడీకి తెగబడ్డారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు కుప్పలు, తెప్పలుగా వస్తున్నాయి. ఫిమేల్‌ ఎస్కాట్‌ సర్వీస్‌ పేరుతో చేస్తున్న ఈ మోసాల పట్ల అందరూ అలెర్ట్ గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇండియా డేట్స్, లోకాంటో.కామ్, మింగిల్‌ తదితర డేటింగ్‌ సైట్లలో స్పెషల్ డేటింగ్‌ ప్యాకేజీ పేరుతో కేటుగాళ్లు పోస్టులు చేస్తున్నారు. ఏ ఏరియా అయినా, ఎనీ టైమ్ కాల్‌ గరŠల్స్‌ను పంపిస్తామంటూ…అంతా కస్టమర్‌ చాయిస్‌ అంటూ పంజా విసురుతున్నారు.అలాగే రకరకాల నంబర్లతో మోసగాళ్లు వీడియో కాల్స్‌ చేస్తున్నారు. ఆ తర్వాత చాటింగ్‌, కాస్త దగ్గరయ్యాక యువకులు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు అమ్మాయిలతో డేటింగ్‌ చేయిపిస్తామంటూ వారి ఫోన్‌ నంబర్‌ కూడా ఇస్తామంటూ యువకులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత ముందుగా అడ్వాన్స్ పే చేయమనడంతో బాధితులు చేస్తున్నారు. ఆ తర్వాత సేఫ్టీ డిపాజిట్, సెక్యూరిటీ ఫీజుల పేరుతో జేబులు గుళ్ల చేస్తున్నారు. ఒక్కోసారి అడిగినంత పేమెంట్ ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరిస్తున్నారు. దీంతో యువత ఇటువంటి సైట్లు, మెసేజీల పట్ల ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

Also Read :

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటివ్

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !