AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విభజనా ? చర్చలా ? ఆర్టీసీపై అసలేం జరుగుతోంది ?

ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఇంకోవైపు ప్రభుత్వం ప్రత్యా్మ్నాయ ఏర్పాట్లు. 28 రోజులుగా తెలంగాణ గట్టు మీద ఎర్రబస్సుకి రెడ్‌లైట్‌ తొలగని పరిస్థితి. అటు- చర్చలు జరపాలన్న హైకోర్టు, లెక్కలపై ఆర్టీసీ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది. అటు 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పో్యారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీలో వాటాదారు అయిన కేంద్రప్రభుత్వం- సమ్మెపై స్పందించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికీ సంక్లిష్టంగా ఉన్న కనిపిస్తున్న ఆర్టీసీ సమస్యకు పరిష్కారం ఇంకెన్నడు అన్నదే ఇప్పుడు పెద్ద […]

విభజనా ? చర్చలా ? ఆర్టీసీపై అసలేం జరుగుతోంది ?
Rajesh Sharma
|

Updated on: Nov 01, 2019 | 6:59 PM

Share
ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఇంకోవైపు ప్రభుత్వం ప్రత్యా్మ్నాయ ఏర్పాట్లు. 28 రోజులుగా తెలంగాణ గట్టు మీద ఎర్రబస్సుకి రెడ్‌లైట్‌ తొలగని పరిస్థితి. అటు- చర్చలు జరపాలన్న హైకోర్టు, లెక్కలపై ఆర్టీసీ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది. అటు 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పో్యారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీలో వాటాదారు అయిన కేంద్రప్రభుత్వం- సమ్మెపై స్పందించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికీ సంక్లిష్టంగా ఉన్న కనిపిస్తున్న ఆర్టీసీ సమస్యకు పరిష్కారం ఇంకెన్నడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఆ సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన వివరాలపై హైకోర్టు సీరియస్‌ అయింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ నుంచి 1786 కోట్లు రావాలనీ, కానీ ఆ సంస్థ మాత్రం నిధులు చెల్లించలేమని చెప్పిందన్నది ఆర్టీసీ నివేదిక. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఆ సంస్థ నిధులు ఇవ్వలేమని చెప్పినందున- వాటిని బకాయిలుగా పరిగణించలేమని ఆర్టీసీ ఎండీ చెప్పారు.
అయితే, అసలు జీహెచ్ఎంసీ నుంచి నిధులు వస్తాయా రావా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీ ఇచ్చిన నివేదిక అసంపూర్తిగా ఉందనీ, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాస్తున్నారని తప్పుబడుతూ ఈ కేసు విచారణను ఏడో తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఆర్టీసీకి, జీహెచ్‌ఎంసీ మధ్య అసలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ పరిస్థితుల్లో శనివారం తెలంగాణ కేబినెట్‌ భేటీ అవుతోంది. ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అంటే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ప్రైవేటు ఆపరేటర్ల విషయంలోనా, కార్మిక సంఘాలతో చర్చల విషయంలోనా అన్నది అసలు పాయింట్‌. మొత్తమ్మీద సుమారు నెలరోజుల సమ్మెకు పరిష్కారం ఎవరి చేతుల్లో ఉన్నదన్నదే చర్చనీయాంశం.