Farmers Protest: ఢిల్లీ సింఘు, యూపీ ఘాజీపూర్ బోర్డర్స్ నుంచి ఇంటి ముఖం పడుతున్న రైతులు, ఇక ఆందోళన దేశవ్యాప్తం

| Edited By: Pardhasaradhi Peri

Feb 16, 2021 | 10:40 AM

ఢిల్లీ లోని సింఘు. యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ బోర్డర్స్ లో ఇన్నాళ్లుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు క్రమంగా 'పల్చబడుతున్నాయి'. ఈ ప్రాంతాలు దాదాపు బోసిపోయి కనిపిస్తున్నాయి..

Farmers Protest: ఢిల్లీ సింఘు, యూపీ ఘాజీపూర్ బోర్డర్స్ నుంచి  ఇంటి ముఖం పడుతున్న రైతులు, ఇక ఆందోళన దేశవ్యాప్తం
Follow us on

Farmers Protest: ఢిల్లీ లోని సింఘు. యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ బోర్డర్స్ లో ఇన్నాళ్లుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు క్రమంగా ‘పల్చబడుతున్నాయి’. ఈ ప్రాంతాలు దాదాపు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక్కడి వేల సంఖ్యల్లో ఉన్న రైతులు క్రమేపీ మళ్ళీ ఇళ్ళ ముఖం పట్టి తిరిగి తమ పంట పొలాల బాట పడుతున్నారు. అయితే అంత మాత్రాన తమ నిరసన ఇక ముగుస్తున్నట్టే అనుకుంటే పొరబాటే అంటున్నారు వారు. ఇక దేశ వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని ప్రకటిస్తున్నారు. రైతు నేత రాకేష్ తికాయత్ మహాపంచాయత్ లలో పాల్గొనబోతున్నారు. తను రానున్న 10 రోజుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేసి రైతు చట్టాలకు వ్యతిరేకంగా మరింతమంది అన్నదాతలను సమీకరిస్తానని ఆయన తెలిపారు. ఈ బోర్డర్స్ లో అన్నదాతల ఆందోళన మంగళవారం నాటికీ 83 వ రోజుకు చేరుకుంది

తామిక దేశ వ్యాప్తంగా భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని తికాయత్ తెలిపారు. అక్టోబరు 2 వరకే కాదు.. ఆ తరువాత కూడా ఆందోళన సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ బోర్డర్స్ లో తాజాగా గత నెలతో పోలిస్తే ఇప్పుడు సగం మంది రైతులే కనిపిస్తున్నారని, కానీ ఇక్కడ 10 లక్షలమందితో నిరసన చేసినా కేంద్రం తన వైఖరి మార్చుకునేట్టు కనిపించడం లేదని, అందువల్ల యావత్ దేశానికి మా నిరసనను వ్యాపింపజేస్తామని ఆయన చెప్పారు మరో రైతు నేత కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.దేశంలోని అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే ఒక్క రోజులో ఈ బోర్డర్స్ లో లక్ష మంది రైతులను సమీకరించగలుగుతామన్నాడు. స్వల్ప వ్యవధిలో మళ్ళీ అన్నదాతలు ఇక్కడికి చేరుకోగలరని ఆయన తెలిపాడు.

Read More:

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..

Job News : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు