Araku Valley : అరకులో కఠిన ఆంక్షలు..కొత్త సంవత్సరం వేడుకలకు రావొద్దని పోలీసుల సూచన

పర్యాటక ప్రాంతం అరకు లోయకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. శీతాకాలం అరకు అందాలను చూడటానికి అనువైన కాలం కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Araku Valley : అరకులో కఠిన ఆంక్షలు..కొత్త సంవత్సరం వేడుకలకు రావొద్దని పోలీసుల సూచన

Updated on: Dec 25, 2020 | 9:23 AM

Araku Valley :  పర్యాటక ప్రాంతం అరకు లోయకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. శీతాకాలం అరకు అందాలను చూడటానికి అనువైన కాలం కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే  కోవిడ్ నేపధ్యంలో పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు.  నేటి నుంచి జనవరి1 వరకు ప్రత్యేక ఆంక్షలు అమలవ్వనున్నాయి.  రాత్రి పూట ప్రీ న్యూయర్ వేడుకలు, సెలబ్రేషన్స్‌కు బ్రేక్‌లు పడ్డాయి.  10 గంటల తరువాత రోడ్లపైకి ఎవరినీ అనుమతించడం లేదు.  హోటళ్లు, లాడ్జి యజమానులకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి.  చిలకల గెడ్డ నుంచి చాపరాయి వరకు ప్రత్యేక అదనపు బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

డిసెంబరు చివరివారంలో అరకుకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని డుంబ్రిగుడ సీఐ పైడయ్య తెలిపారు.  కోవిడ్ నేపధ్యంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చామని చెప్పారు.  10 మొబైల్ టీమ్స్ తో వారం రోజుల పాటు విసృత తనిఖీలు చేస్తామన్నారు.  కోవిడ్ నేపధ్యంలో పర్యాటకులు సహకరించాని కోరారు.  డిసెంబరు 31 న రాత్రి 9 గంటలకే షాపులన్నీ బంద్ చేయాలని..అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అరకు వచ్చి ఇబ్బంది పడొద్దని… న్యూ ఇయర్ వేడుకలు కుటుంబ సభ్యులతో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలని సూచించారు.

Also Read :

Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ