భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 19,906 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అటు సుమారు వారం రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య 14 వేలు దాటుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 5,28,859 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,03,051 యాక్టివ్ కేసులు ఉండగా, 3,09,713 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు తాజాగా 410 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 16,095కు చేరింది.
ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే…
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..
ఇది చదవండి: ఏపీ డిగ్రీ, పీజీ పరీక్షలపై.. మంత్రి కీలక ప్రకటన..