కోవిడ్ చికిత్సలో వాడే తమ యాంటీ బాడీ కాక్-టెయిల్ తొలి బ్యాచ్ మెడిసిన్ ని ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు దీని ఉత్పాదక సంస్థ రోచె ఇండియా ప్రకటించింది. కెసిరివిమాబ్, ఇమ్ డెవిమాబ్ అనే రెండు మందుల మిశ్రమంతో గల దీన్ని కాక్-టెయిల్ మందుగా వ్యవహరిస్తున్నారు. ఈ మెడిసిన్ డోసు ధర 59,750 రూపాయలట…దీన్ని గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోవిద్ బారిన పడినప్పుడు వాడినట్టు రోచె సంస్థ వెల్లడించింది. 1200 ఎంజీల డ్రగ్ లో ఒక్కొక్కటి 600 ఎంజీల కెసిరివిమాబ్, ఇంతే ఎంజీల ఇమ్ డెవి మాబ్ ఉంటాయని రోచె ఇండియా వెల్లడించింది. దీని గరిష్ట ధర లక్షా 19 వేల 500 రూపాయలని వివరించింది.ఒక్కో ప్యాక్ ఇద్దరు కోవిద్ రోగులకు సరిపోతుందని, ఇండియాలో దీని మెదటి బ్యాచ్ ని సిప్లా సంస్థ మార్కెట్ చేస్తుందని వెల్లడించింది. రెండో బ్యాచ్ జూన్ మధ్యకల్లా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మొత్తం మీద రెండు లక్షల మంది కోవిద్ రోగులకు మొదటి బ్యాచ్ ఉపయోగకరమని భావిస్తోంది. ఈ మెడిసిన్ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రులు, కోవిద్ ట్రీట్ మెంట్ సెంటర్లలో లభించనుంది. ఇండియాలో ఈ యాంటీ బాడీ కాక్-టెయిల్ మందు అత్యవసర వినియోగానికి ఇటీవల సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతించింది.
కాగా ఇంత ఖరీదైన మందు కోటీశ్వరులకే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే కోవిద్ చికిత్సకు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇస్తున్న పసరు మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని ఆయుర్వేద విభాగం ప్రకటించింది.. ఉచితంగా ఇస్తున్న ఈ మందుకు వేలాది రోగులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య చికిత్సా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు హర్యానాలో రామ్ దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థ మందు కొరొనిల్ ని ఉచితంగా రోగులకు ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వివాహం జరుగుతుండగా వధూవరులు సయ్యాలాట.. ఫన్నీ వీడియో వైరల్.!